19-07-2025 12:00:00 AM
కొండాపూర్, జూలై 18: కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్లు లేని నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేదల ప్రజలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తుందని ఆత్మ కమిటీ చైర్మన్ వై ప్రభు అన్నారు. శుక్రవారం కొండాపూర్ మండలం పరిధిలోని గంగారంలో మంజూరైన లబ్ధిదారులకు ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, ఎంపీడీవో సత్తయ్య చేతుల మీదుగా ప్రొసీడింగ్ లు అందజేశారు.
ఈ సందర్భంగా ప్రభు మాట్లాడుతూ ఇళ్లు లేని వారిని గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ సత్తయ్య, ఆత్మ కమిటీ చైర్మన్ వై . ప్రభు,కొండాపూర్ మాజీ ఎంపీటీసీ నర్సింహారెడ్డి, పంచాయతీ కార్యదర్శి మంజుల,గ్రామ పెద్దలు నర్సింహారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ నర్సింలు, మండల యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అశోక్ యాదవ్, ఇంద్రమ్మ కమిటీ సభ్యులు స్వప్న చెందమ్మ హనుమంత్ రెడ్డి, కిరణ్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, గ్రామ ప్రజలుపాల్గొన్నారు.