calender_icon.png 19 July, 2025 | 1:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు

18-07-2025 11:10:50 PM

కోటపల్లి సిఐ బన్సీలాల్

కోటపల్లి: కోటపల్లి, నీల్వాయి పోలీస్ స్టేషన్లో పరిధిలో ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన, ఉద్దేశ్య పూర్వకంగా శాంతి భద్రతలకు విఘాతం కల్గించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పని కోటపల్లి సిఐ బన్సీలాల్ హెచ్చరించారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ... అక్రమ ఇసుక రవాణా, పిడిఎస్ రైస్ రవాణా, గుడుంబా రవాణా చేయడం, గంజాయి అమ్మకం, సేవించడం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా పీడీ యాక్ట్ కేసులు కూడా నమోదు చేస్తామన్నారు. చట్టాన్ని అతిక్రమించి గొడవలకు పాల్పడడం, ఉదేశ్య పూర్వకంగా శాంతి భద్రతలకు విఘాతం కల్గించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడమేగాక, అటువంటి ప్రవర్తన కలిగిన వారిపై రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేయబడుతాయన్నారు. ప్రతి ఒక్కరు చట్టానికి లోబడి వుంటూ పోలీస్ వారికి సహకరించాలనీ కోరారు.