calender_icon.png 31 December, 2025 | 6:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమంగా గంజాయి రవాణా

31-12-2025 12:00:00 AM

  1. 52 కిలోల సరుకు, బొలెరో వాహనం స్వాధీనం

ముగ్గురి అరెస్ట్, పోచారం ఐటీ కారిడార్ పీఎస్ పరిధిలో ఘటన

ఘట్‌కేసర్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 52 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న సంఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది.పోచారం ఐటీసీ ఇన్ స్పెక్టర్ రాజువర్మ తెలిపిన వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ పట్టణం నుంచి హైదరాబాద్‌కు (ఏపీ 40 హెచ్‌ఎం 1835) నంబర్ గల మహేంద్ర బొలెరో వాహనంలో గంజాయి తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది.

దీంతో అప్రమత్తమైన పోచారం ఐటీ కారిడార్ పోలీసులు యంనంపేట్ కిట్టిస్టీల్ వద్ద వాహనా న్ని ఆపి తనిఖీ నిర్వహించారు. తనిఖీల్లో వాహనంలో భారీగా గంజాయి ఉన్నట్లు గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అంబర్‌పేట్‌కు చెందిన షేక్ పేర్వాలి, సఫిల్ గూడకు చెందిన ధరావత్ సుభాష్, మలక్‌పేటకు చెందిన సిరిమ ల రవికుమార్‌లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 52 కిలోల గంజాయితో పాటు మహేంద్ర బొలెరో వాహనాన్ని స్వా ధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.