07-11-2025 05:58:05 PM
వందేమాతర గేయాన్ని ఆలపించిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
నిర్మల్,(విజయక్రాంతి): వందేమాతరం గేయాన్ని రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నేడు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి వందేమాతర గేయాన్ని ఆలపించారు. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, నాయకులు మేడిసెమ్మ రాజు, పట్టణ అధ్యక్షులు సుంకరి సాయి, నాయకులు జమాల్, పట్టణ నాయకులు శ్రీరామోజు నరేష్, జుట్టు దినేష్, జప ప్రసాద్, మాజీ కౌన్సిలర్ పాతర్ల గణేష్, సుంకరి రాజేష్, శ్రీకాంత్ రెడ్డి, ఉదయ్ గౌడ్ , తో పాటు తదితరులు పాల్గొన్నారు.