30-11-2024 11:02:15 PM
మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలోని ఎస్ఎస్ఈసీ గర్ల్స్, ఎస్సీ బాయ్స్ వసతి గృహాల్లోని విద్యార్థినీ, విద్యార్థులకు తహశీల్దార్ ముజాహిద్ శనివారం చలి నుంచి రక్షించే స్వెట్టర్లు, పాదరక్షలు, డిక్షనరీలను ఎంపీడీవో జమలారెడ్డితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చలిని తట్టుకునేందుకు వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో యదుసింహరాజు, వార్డెన్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.