30-11-2024 11:08:01 PM
చింతలపాలెం (విజయక్రాంతి): పులిచింతల ప్రాజెక్టులోకి నీటి ప్రవాహం నిలకడగా కొనసాగుతుంది. వరద నీరు స్వల్పంగా ఉండడంతో ప్రాజెక్టు ఎడమవైపున ఉన్న విద్యుత్ కేంద్రం నుండి విద్యుత్ ఉత్పాదన కొనసాగుతుంది. పులిచింతల విద్యుత్ కేంద్రం పూర్తి సామర్థ్యం 120 యూనిట్లు కాగా మూడు యూనిట్ల నుండి 45 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని ఎస్ఈ దేశ్యా నాయక్ తెలిపారు. విద్యుత్ ఉత్పాదన కోసం 6,000 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం 8 గంటల వరకు ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 45.4620 టీఎంసీలు గా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులకు గాను ఇప్పటి వరకు నీటిమట్టం 174.80 అడుగులకు చేరింది. ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 8577 క్యూసెక్కులు కాగా మొత్తం అవుట్ ఫ్లో 6,000 గా ఉంది.