calender_icon.png 14 August, 2025 | 4:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు యూనిఫామ్స్, షూ పంపిణీ

14-08-2025 12:25:02 AM

ఏఎంసీ చైర్మన్ మంతూర్ సుధాకర్ రెడ్డి

మునిపల్లి, ఆగష్టు 13 : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మంతూర్ సుధాకర్ రెడ్డి మునిపల్లి ప్రాథమిక పాఠశాల, హరిజన వాడ ప్రాథమిక పాఠశాలల విద్యార్థులందరికీ సొంత ఖర్చులతో స్పోరట్స్ యూనిఫామ్, బూట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే అన్ని వసతులతో కూడిన మెరుగైన విద్య లభిస్తుందని, ప్రాథమిక స్థాయిలో చదువుల కోసం పిల్లలని ప్రైవేట్ కి పంపకుండా అన్ని అర్హతలు గల ఉపాధ్యాయులతో బోధన జరుగుతున్న ప్రభుత్వ బడులకి పిల్లలని పంపాలని తెలిపారు.

అనంతరం మండల విద్యాధికారి భీమ్ సింగ్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకి స్పోరట్స్ యూనిఫామ్, షూ అందించడం చాలా అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అశోక్ కుమార్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మాధవి, నాగభూషణం  నాయకులు బాలాజీ, నర్సింలు, వినాయకుమార్, నవీన్, ప్రశాంత్, భీమన్న, కేదరనాథ్, ప్రభాకర్, ప్రభుదాస్, నరేష్, మహేష్, విట్ఠల్ రెడ్డి, ఎల్లగౌడ్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ రాములమ్మ, పాఠశాల ఉపాధ్యాయులు మధురిమ, కవిత, అరుణకుమారి, చంద్రమౌళి, బుష్రా, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులుపాల్గొన్నారు.