calender_icon.png 9 July, 2025 | 6:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

09-07-2025 12:14:47 AM

ప్రభుత్వ పాఠశాలల, సంక్షేమ పథకాల పరిశీలన

సిద్దిపేట, జూలై 8 (విజయక్రాంతి): జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాల అమలు, పర్యావరణ పరిరక్షణ, పౌరుల అవసరాలపై ఫోకస్ చేస్తూ కలెక్టర్ హైమావతి మంగళవారం పర్యటించారు. చిన్నకోడూరు మండలంలోని చందులాపూర్ గ్రామంలోని పశుసంవర్ధక పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటి  పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేశారు. ప్రభుత్వం ఉచితంగా మొక్కలను అందిస్తోందని, ప్రజలంతా మొక్కలు నాటి ప్రకృతికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.

గంగాపూర్ గ్రామంలో ఇందిరమ్మ గృహాల నిర్మాణాన్ని సమీక్షించారు. 18 ఇండ్లలో 12 ఇండ్లకు ముగ్గు పోయడం పూర్తున నేపథ్యంలో నిర్మాణాన్ని వేగవంతం చేయాలని లబ్ధిదారులకు సూచించారు. డబ్బులు లేని లబ్ధిదారులకు ఐకెపి ద్వారా ముందస్తు సహాయం అందించాలని ఆర్డీవో సదానందం,  సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇసుక కొరత లేకుండా వెంటనే టోకెన్లు జారీ చేయాలని ఆదేశించారు. చందులాపూర్ వద్ద గల రంగనాయక సాగర్ పంప్ హౌస్ను పరిశీలించి, నిర్మాణ నాణ్యత, వాటర్ పంపింగ్ వివరాలను సమీక్షించారు.

నంతరం గెస్ట్ హౌస్ పరిశుభ్రతను పరిశీలించి, శుభ్రంగా ఉంచాలని నిర్వాహకులకు సూచనలు ఇచ్చారు. కోహెడ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించి మధ్యాహ్న భోజనంలో అవ్యవస్థలపై స్పందించారు. మెనూ ప్రకారం భోజనం వేయకపోవడాన్ని ప్రశ్నించగా, రాబోయే రోజుల్లో అలాంటి తప్పిదాలు జరగకూడదని హెచ్చరించారు. డైనింగ్ హాల్ ఉన్నప్పటికీ బయట భోజనం పెట్టడం సరికాదని, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు.

కోహెడ మండలంలోని వాగుల్లో అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న ట్రాక్టర్ను గుర్తించి చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఆదేశించారు. అసలైన లబ్ధిదారులకు ఇసుక అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టంగా తెలిపారు. ఈ పర్యటనల ద్వారా అధికార కార్యక్రమాల నిర్వహణలో బాధ్యతాయు తంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంత ముఖ్యమో ఆమె స్పష్టంగా చాటిచెప్పారు.