09-07-2025 12:14:03 AM
ఖైరతాబాద్; జూలై 8 (విజయ క్రాంతి) : ఎలక్ట్రానిక్ పరికరాలలో ఉపయోగించే సెమీ కండక్టర్లకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందని, తెలంగాణ రాష్ట్రంలో త్వ రలోనే తమ సదరన్ సిలికాన్ సంస్థ ను ఏర్పాటుచేసి సెమీ కండక్టర్ల ఉత్పత్తిని పెం పొందించడమే తమ లక్ష్యం అని సదరన్ సిలికాన్ సంస్థ డైరెక్టర్‌లు హర్ష్ మాలు, తాహెర్ అలీ తెలిపారు..
ఈ మేరకు మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గిరిధరి ఇండస్ట్రీస్ మేనేజింగ్ పార్ట్నర్ అంజిరెడ్డి తో కలిసి వారు వివరాలు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా సెమీ కండక్టర్లకు ఎంతో ప్రాధా న్యత ఉంది అని అన్నారు.
సెమీ కండక్టర్ల తయారీకి ఉపయోగించే ముడి సరుకును (పలుగు రాళ్లను) చైనా దేశం దిగుమతి చేసుకొని వాటిని ప్రాసెస్ చేసి ఎక్కువ ధరకు ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలోనే నేరుగా తమ సంస్థ ద్వారా సెమీ కండక్టర్లను ఉత్పత్తి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. రెండు సంస్థల భాగస్వామ్యంతో 200 పైచిలుకు మందితో త్వరలోనే ఉత్పత్తి ప్రారంభిస్తామని చెప్పారు.