23-09-2025 12:00:00 AM
ప్రజల భద్రత దృష్ట్యా కార్యాలయం మార్పు
అదిలాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి) : ప్రజలు తమ సమస్యల పరిష్కా రానికి కలెక్టరేట్ కు వచ్చే ప్రజల సౌకర్యార్థం, ప్రజల భద్రత దృష్ట్యా అదనపు కలెక్టర్ కార్యాలయాన్ని మార్చడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఇటీవల భారీ వర్షానికి ఆదిలాబాద్ కలెక్టరేట్ లోని కొంత భాగం కూలిపోవడంతో అందులోని వివిధ విభాగాల కార్యాలయాలను ఇతర చోట్లకు తరలిస్తున్నారు.
ఇందులో భాగంగానే అదనపు కలెక్టర్ కార్యాలయాన్ని పెనుగంగా భవన్ కు మార్చడంతో సోమవారం నూతన అదరపు కలెక్టర్ భావనాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ శ్యామలాదేవి ని శాలువతో సన్మానించి, అభినందించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, శిక్షణ కలెక్టర్ సలోని, ఏవో వర్ణ, పలు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.