23-09-2025 12:00:00 AM
శ్రీ మల్లికార్జున స్వామికి అనిల్ జాదవ్ ప్రత్యేక పూజలు
ఆదిలాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాం తి) : అతి ప్రాచీన ఆలయాల్లో ఒకటైన సిరిచెల్మ లోని శ్రీ మల్లిఖార్జున స్వామి ఆల యాన్ని అభివృద్ధి చేసేందుకు తనవంతుగా కృషి చేస్తానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. సోమవారం ఇచ్చోడ మండలంలోని పురాతన సిరిచెల్మ లోని శివాల యంలో దేవి నవరాత్రుల సందర్భంగా ఎమ్మెల్యే ఆలయాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా ఆలయం చుట్టూ నీరు నిలువ ఉండడంతో నాటు పడవ మీద వెళ్ళి శివునికి ప్రత్యేక పూజలు చేశారు. బోథ్ నియోజకవర్గ ప్రజలకు దేవి నవరాత్రుల శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ప్రజలు అందరూ సుఖ శాంతులతో ఉండి, పాడిపంటలు బాగా పండి రైతులకు మంచి దిగుబడి రావాలి ఆ శివున్ని కోరుకున్నానని పేర్కొన్నారు.