14-03-2025 01:32:41 AM
మందమర్రి, మార్చి 13 (విజయక్రాంతి) : మండలంలోని వెంకటాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని గుడిపల్లి గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి పి యాదయ్య ఆకస్మిక తనిఖీ చేశారు. గురువారం పాఠశాలను సందర్శించి రికార్డులు పరిశీలించారు.
అనంతరం పాఠశాలలో మౌలిక వసతులను పరిశీలించి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పరీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంపొందించడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందజేయాలన్నారు. అంతేకాకుండా విద్యార్థుల్లో అభ్యసన సామర్ధ్యాన్ని పెంపొందిం చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విద్యాదేవి ఉపాద్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.