14-03-2025 01:33:45 AM
ఆర్మూర్,మార్చ్13:(విజయ క్రాంతి):క్షత్రియ పాఠశాల చేపూర్ నందు 2024- 25 వ సంవత్సరం పదో తరగతి విద్యార్థుల ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని క్షత్రియ విద్యాసంస్థల చైర్మన్ శ్రీ అల్జాపూర్ శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు.ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం లో చైర్మన్ శ్రీ అల్జాపూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ కార్యక్రమం నిర్వహించిన తొమ్మిదో తరగతి విద్యార్థులను అభినందిస్తు, ప్రతి విద్యార్ధి ఒక లక్ష్యంతో ముందడగు వేయాలని, క్రమశిక్షణతో లక్ష్యాన్నిసాధించుకోవచ్చునని,ఎల్లప్పుడూ ఆత్మ విశ్వాసంతో ఉంటూ ఎన్ని అవరోధలు ఎదురైన ధైర్యంగా ఎదురుకుంటూ ముందడుగు వేయాలని సూచించారు.
ప్రతి విద్యార్ధి ఎదిగిన కొద్ది ఒదిగి ఉండాలని, చెడు వ్యసనలకు లోను కాకుండా తమ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని సూచించారు. స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మి నరసింహ స్వామి మాట్లాడుతూ విద్యార్థులు నైతిక విలువలను పాటిస్తూ జీవితంలో ఉన్నత స్థాయికి స్థిరపడాలని అన్నారు. పదో తరగతి విద్యార్థులు తమ తమ మధురానుభూతులను తెలియజేసినారు. పదో తరగతికి బోధించిన ఉపాధ్యాయులు విద్యార్థుల భావి జీవితానికి ఉపయోగపడే తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్బంగా విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల కరెస్పాండంట్ అల్జాపూర్ దేవేందర్, కోశాధికారి అల్జాపూర్ గంగాధర్, డైరెక్టర్స్, వైస్ ప్రిన్సిపాల్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.