31-07-2025 07:46:20 PM
లక్షేట్టిపేట,(విజయక్రాంతి): మండలంలోని వెంకట్రావుపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ మందుల నిలువలను ఫార్మసిని, ల్యాబ్, ఓపి రూములను, వార్డులను గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ...... ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సుప్రవేజర్లు సరైన రీతిలో పనిచేయడం లేదని ఆ గ్రామం వ్యక్తం చేసినాలరని అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారము అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ ఉపకేంద్రములలో ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉండాలని అదేవిధంగా జిల్లాలోని సుప్రవైజర్లందరూ తమ పరిధిలోని గర్భవతులకు సంబంధించిన ఈటీడీ వివరములను దగ్గర ఉంచుకోవాలని వైద్యాధికారి రూములో టేబుల్ పైన ఉంచాలని ఆదేశించారు.