25-07-2025 12:50:45 AM
ములుగు వెంకటపూర్,జూలై24(విజయక్రాంతి): ములుగు జిల్లా వెంకటాపూర్ మండల పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్.పి తనిఖీ చేయడం జరిగింది.ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ పోలీస్ స్టేషన్ పరిసరాలను, వాటి పరిశుభ్రతను క్షుణ్ణంగా పరిశీలించారు రిసెప్షన్ సెంటర్ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. రిసెప్షన్ సిబ్బంది ఫిర్యాదు దారులతో మర్యాదగా వ్యవహరించాలని, ఫిర్యాదు అందిన వెంటనే విచారణ అధికారిని నియమించి విచారణ అనంతరం ఆలస్యం చేయకుండా కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
5S విధానం అమలు చేస్తున్నారా లేదా అని అడిగి,స్టేషన్ మొత్తం కలియతిరిగి పరిశీలించారు. స్టేషన్ రికార్డులను పరిశీలించి, ప్రతి వర్టికల్ కు ఒక అధికారిని కేటాయించి ఎప్పటికప్పుడు రికార్డులు పెండింగ్ లేకుండా పని పూర్తి చేయాలని ఆదేశించారు.విచారణలో ఉన్న కేసులను పరిశీలించి ప్రతికేసులో ప్లాన్ ఆఫ్ యాక్షన్ కలిగి ఉండాలని సూచించారు. మిస్సింగ్ కేసుల చేదనకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
కంప్యూటర్ సిబ్బంది పనితీరును పరిశీలించి ఎటువంటి పని పెండింగ్ పెట్టకుండా ఎప్పటికప్పుడు ఫైల్ లు ఆన్లైన్లో అప్డేట్ చేస్తూ ఉండాలని ఆదేశించారు.రోడ్డు ప్రమాదాలపై ప్రజలలో అవగాహన తీసుకురావాలని అన్నారు.