calender_icon.png 28 July, 2025 | 7:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాణ్యమైనవి అందుబాటులో ఉంచాలి

25-07-2025 12:52:30 AM

ఏటూరునాగారం,జూలై24(విజయక్రాంతి): ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని చిన్నబోయినపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వారి ఎరువుల విక్రయ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. గురువారం రోజు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ఖరీఫ్ సీజన్ లో రైతులు సాగు చేసేందుకు నాణ్యమైన విత్తనాలు,ఎరువులు,పురుగు మందులను సరిపోను విత్తన, ఎరువులు, పురుగుమందుల దుకాణాలలో అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ అన్నారు.

ఈ సందర్భంగా విత్తన, ఎరువులు, పురుగు మందుల నిల్వలు, విక్రయాలకు సంబంధించిన రికార్డులు, బిల్లు బుక్కులు,లైసెన్స్ ను కలెక్టర్ తనిఖీ చేశారు. గోదాములో నిల్వ చేసి ఉన్న విత్తనాలు,ఎరువులు,మందులను కలెక్టర్ పరిశీలించారు. ఈ-పాస్ మిషన్ వినియోగం గురించి విత్తన, ఎరువుల దుకాణాదారులను అడిగి తెలుసుకున్నారు.

దుకాణాలలో విత్తన,ఎరువులు,పురుగు మందుల నిల్వలకు సంబంధించిన స్టాక్ బోర్డులను పరిశీలించారు. రిజిస్టర్ సక్రమంగా నిర్వహించాలని   పిఎసిఎస్ ఇబ్బందికి సూచించారు. ఏరకం ఎక్కువగా విక్రయిస్తున్నారనే వివరాలను దుకాణదారులను అడిగి తెలుసుకున్నారు దుకాణంలో నిల్వల వివరాలను ప్రతిరోజు వ్యవసాయ శాఖ అధికారులకు అందించాలని సూచించారు.