calender_icon.png 19 August, 2025 | 3:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కౌలాస్ నాలా ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తివేత

19-08-2025 12:00:00 AM

29వేల 444 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం 

కామారెడ్డి, ఆగస్టు 18 (విజయ క్రాంతి) ః భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లాలోని కౌలాస్ నాలా ప్రాజెక్టు ఐదు గేట్లను సోమవారం ఉదయం అధికారులు వరద గేట్లను ఎత్తినట్లు నీటిపారుదల శాఖ ఏఈ సుకుమార్ రెడ్డి వెల్లడించారు. ప్రాజెక్టుల్లోకి ఎగువ నుంచి 29,444 క్యూసెక్కుల ఇన్ఫ్లో రావడంతో ఐదు వరద గేట్లను ఎత్తినట్లు తెలిపారు. ఐదు గేట్ల ద్వారా 31, 350 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 458 మీటర్ల(1.237 టీఎంసీలు) గాను 457.80 మీటర్లు(1,200 టీఎంసీలు) నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. కాలువల ద్వారా వెళ్లే నీటి ప్రభావానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నీటి వద్దకు వెళ్ళవద్దని సూచించారు.