calender_icon.png 25 December, 2025 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నైతిక విలువలను పెంపొందించాలి

25-12-2025 02:27:54 AM

జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆడెపు భాస్కర్

కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 24(విజయక్రాంతి): బాలలలో సత్యం, ధర్మం పట్ల నిబద్ధత, దేశభక్తి, నైతిక విలువలను పెంపొందించాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆడెపు భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, మహిళ సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 30 తేదీన జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవనంలో నిర్వహించనున్న వీర్ బాల్ దివస్ ను పురస్కరించుకొని పాఠశాలలు, కళాశాలలలో విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన, క్విజ్, డిబేట్ పోటీలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ఇందులో భాగంగా బుధవారం  కాగజ్ నగర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, డిగ్రీ కళాశాల, బెండర డిగ్రీ కళాశాలల విద్యార్థులకు పోటీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. విద్యార్థులకు దేశభక్తి, నైతిక విలువలపై అవగాహన కల్పించడం జరిగిందని, ధర్మం కోసం ప్రాణాలు అర్పించిన వీర బాలల త్యాగాన్ని గుర్తు చేసి, వారి విలువలను సమాజానికి తెలియజేయడం వీర్ బాల్ దివస్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు.