25-12-2025 02:29:02 AM
ఆదిలాబాద్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): దేశ హితం కోసం అనునిత్యం పాటు పడిన గొప్ప మహనీయుడు మాజీ ప్రధాని, స్వర్గీయ అటల్ బిహారీ వాజపేయ్ అని ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నా రు. మాజీ ప్రధాని వాజపేయ్ 101 జయంతి ని పురస్కరించుకొని ఆదిలాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం రాత్రి దీపోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా వాజపేయ్ చిత్రపటానికి పూలమాల లు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎంపీ , ఎమ్మెల్యే మాట్లాడుతూ... వాజపేయ్ అధికా రం కోసం తాపత్రయ పడకుండా ప్రజా సేవ కు పాటు పడ్డారని, నీతి నిజాయితీ గల రాజకీయ నాయకుడిగా ఎంతో పేరుగాంచారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, నాయకులు సంతో ష్, నగేష్, లాలా మున్నా, రాకేష్, దినేష్ మాటోలియా, రాజు, జోగు రవి, రఘుపతి, కృష్ణ యాదవ్, రాజేష్. తదితరులు ఉన్నారు.