27-12-2025 02:39:19 AM
భీమదేవరపల్లి, డిసెంబర్ 26 (విజయక్రాంతి): ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి జన్మదినం సందర్భంగా ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ నేషనల్ జాయింట్ కోఆర్డినేటర్, రైతు విభాగం మహారాష్ట్ర కో ఆర్డినేటర్ డీకే స్వామి పూల మాల, శాలువాతో శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కిసాన్ కాంగ్రెస్ నేషనల్ జాయింట్ కోఆర్డినేటర్ డీకే స్వామి రైతు సమస్యల గురించి ప్రభుత్వ సలహాదారుకు విన్నవించగా, సానుకూలంగా స్పందించారు.
రాష్ట్రంలో రైతుల సమస్యలు తప్పకుండా తీరుస్తామని హామీ ఇచ్చారు. కాగా జనవరి రెండోవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రుని బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని అర్చకులు జానకిపురం రవి శర్మ ఆహ్వాన పత్రిక అందజేశారు. డీకే స్వామి వెంట రాచర్ల చంద్రశేఖర్, గుడికందుల వెంకట్రాజం తదితరులు ఉన్నారు.