27-12-2025 02:41:16 AM
జనవరి ౨8 నుంచి 31 వరకు జాతర నిర్వహణ : మంత్రి సీతక్క
ములుగు,డిసెంబర్26(విజయక్రాంతి): ప్రపంచ చరిత్రలోనే సమ్మక్క సారలమ్మ మహా జాతర నిర్మాణ పనులు ఒక మైలు రాయిగా నిలిచిపోతాయని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ,పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అనసూయ పేర్కొన్నారు.నిర్మాణ పనులు 200 ఏళ్లపాటు చెక్కుచెదరకుండా ఉండేలా చేపడుతున్నామన్నారు. 4వేల టన్నుల గ్రానైట్ పై ఆదివాసీ చరిత్ర సంస్కృతి తెలియజేసే 7,000 బొమ్మలతో సమ్మక్క సారలమ్మ నిర్మాణం పనులు వేగవంతంగా సాగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు.
శుక్రవారం ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క సారలమ్మ పునర్ నిర్మాణం పనులు పరిశీలించేందుకు హైదరాబాదు నుంచి మీడియా ప్రతినిధుల బృందం వచ్చింది. సమ్మక్క సారలమ్మ చరిత్ర ,పునర్నిర్మాణ నిర్మాణ పనులు ఆదివాసీల మూలా లు జాతర చరిత్రను మీడియా బృందానికి వివరించారు. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జరిగే జాతరకు తెలంగాణతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి కోటి మందికి పైగా భక్తులు తరలి వస్తారని అం చనా వేస్తున్నామన్నారు.ఎన్నడూ లేనివిధంగా రూ.251 కోట్లతో మేడారం అభి వృద్ధికి చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు.
కనివిని ఎరుగని రీతిలో జాతర
చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో ఈసా రి సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహిస్తున్నామని భక్తులందరూ విజయవంతానికి కృషి చేయాలని సహకరించాలని మంత్రి కోరారు. ఆదివాసిల సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీటవేస్తూ ప్రతి నిర్మాణం చేపడుతున్నామని సంస్కృతి ప్రతిబింబించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాగా మేడారం ఆలయంలో పునర్నిర్మాణ పనులు వేగవంతానికి మంత్రుల బృందం ప్రతిరోజు సమీక్ష నిర్వహిస్తున్నదని మంత్రి పేర్కొన్నారు.