19-07-2025 12:08:33 AM
కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే రత్నం
చేవెళ్ల, జులై 18: మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్కెపల్లిలో గోశాల బాధి త రైతులకు న్యాయం చేయాలని మాజీ ఎ మ్మెల్యే రత్నం కోరారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ కు నారాయణ రెడ్డికి వినతి ప త్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం కోకాపేటలో ఉ న్న గోశాలను దళిత రైతులు సాగు చేసుకుంటున్న భూముల్లోకి తరలించే ప్రయత్నం సరి కాదన్నారు.
పరిహారమైనా సరిగ్గా ఇవ్వడం లేదని, ఎకరాకు 300 గజాలు మాత్రమే ఇ వ్వడమేంటని ప్రశ్నించారు. గోశాలను మరోచోట ఏర్పాటు చేయాలని, లేదా రైతులు కోరిన మేరకు కనీసం 1000 గజాలైనా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కంజర్ల ప్రకాష్, ప్రభాకర్ రెడ్డి , కిసాన్ మోర్చా అధ్యక్షుడు మోర నర్సింహారెడ్డి, డాక్టర్ వైభవ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, తదితరులుపాల్గొన్నారు.