19-07-2025 12:07:42 AM
పట్టణంలో అన్ని వార్డులను ఆదునికరిస్తా
పెద్దపల్లి పట్టణంలో బిటి రోడ్డు పనుల పరిశీలనలో ఎమ్మెల్యే విజయరమణ రావు
పెద్దపల్లి,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధి, సంక్షేమమని, అదే స్పూర్తితో పెద్దపల్లి పట్టణంలోని అన్ని వార్డులను ఆదునికరిస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామణారావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని దేవుడి కోటా నుండి చాకలి ఐలమ్మ విగ్రహం నుండి శంకర్ గంజ్ జెండా చౌరస్తా వరకు టి.యూ.ఎఫ్.ఐ.డి.సి నిధులు రూ. 2 కోట్ల తో నిర్మిస్తున్న బిటి రోడ్ల పనులను శుక్రవారం సాయంత్రం మున్సిపల్ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... పెద్దపల్లి పట్టణంలోని ప్రతి వార్డు ప్రతి గల్లీ గల్లిని అభివృద్ధి పథంలో నడిపిస్తామని తనకు పట్టణ ప్రజల సహకారం అవసరమన్నారు. ఇప్పటికీ జరుగుతున్న అభివృద్ధి పనులకు సహకరించిన పట్టణ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో మరి ఎన్నో అభివృద్ధి పనులను చేస్తామన్నారు.