calender_icon.png 19 July, 2025 | 6:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడల అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కృషి

19-07-2025 12:08:52 AM

-నిర్మల్ లో రాష్ర్టస్థాయి బ్యాట్మెంటన్ పోటీలు ప్రారంభం

నిర్మల్ జులై 19 (విజయక్రాంతి): దేశంలో క్రీడల అభ్యున్నతికి మోదీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని క్రీడాకారులకు అన్ని విధాల ప్రో త్సాహం అందిస్తామని అదిలాబాద్ ఎంపీ జి నాగేష్, నిర్మల్ ఎమ్మెల్యే బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నా రు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కొం డాపూర్ స్పోర్ట్స్ అకాడమీ మైదానం లో శుక్రవారం రాష్ర్టస్థాయి అండర్ 19 బ్యాడ్మింటన్ పోటీలను వారు ప్రారంభించారు.

ఈ పోటీలకు 31 జిల్లాల నుంచి క్రీడాకారులు రాగా మొదటి రోజు పోటీలను ప్రారంభించి మాట్లాడారు. క్రీడాకారులు రాష్ర్టస్థాయి పోటీలో రాణించి జాతీయాన్ని ఒలింపిక్స్ స్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. బ్యాడ్మింటన్ పోటీలు నిర్మల్‌లో నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉం దన్నారు. క్రీడలకు సహకరిస్తున్న ప్ర తి ఒక్కరికి కృతజ్ఞతలు నిర్వాకులు ముఖేష్‌గౌడ్ సుధాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నేత సత్యనారాయణగౌడ్ పార్టీ జిల్లా అ ధ్యక్షుడు ప్రీతిష్ రాథోడ్. జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శ్రీకాంత్ రెడ్డి. క్రీడాకారులు పీటీలు పాల్గొన్నారు.