calender_icon.png 10 January, 2026 | 11:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆహార పదార్థాల నాణ్యతలో రాజీ పడొద్దు

10-01-2026 12:28:08 AM

  1. నాణ్యత పాటించని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో చేర్చుతాం
  2. ఐటీడీఏ పీవో యువరాజ్ మార్మాట్

ఉట్నూర్, జనవరి 9 (విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకులాలో విద్యను  అభ్యసించే విద్యార్థులకు సరఫరా చేసే ఆహార పదార్థాలు, సరుకులలో ఎలాంటి రాజీ పడవద్దు అని, నాణ్యత ప్రమాణాలను పాటించని కాంట్రాక్టర్ లను బ్లాక్ లిస్టులో చేర్చడానికి వెనకాడబోమని ఐటీడీఏ పీవో యువరాజ్ మార్మాట్ స్పష్టం చేశారు.

శుక్రవారం ఈ పోర్టల్ ద్వారా ఆశ్రమ పాఠశాలకు సరుకులు సరఫరా చేసేందుకు కాంట్రాక్టర్ లు సమర్పించిన  దరఖాస్తులను, ఆహార పదార్థాలను  పరిశీలించారు. ధరల నిర్ణయ కమిటీ కన్వీనర్, జిసిసి డివిజనల్ మేనేజర్ గుడిముల్లా సందీప్ కుమార్, సభ్యులు డిడి జాదవ్ అం బాజీ, జిసిసి సీనియర్ మేనేజర్లు  సంతోష్ కుమార్, తారాచంద్, గులాబ్ సింగ్, లక్ష్మణ్, రమేష్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.