calender_icon.png 24 December, 2025 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నెలరోజులు మద్యం తాగొద్దు

24-12-2025 01:48:00 AM

  1. తాగినా, చెప్పులు వేసుకున్నా జరిమానా
  2. ఆదివాసీ గ్రామాల్లో వింత ఆచారం

ఉట్నూర్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): పుష్య మాసం వచ్చిందంటే చాలు ఆదిలాబాద్ జిల్లాలోని పలు ఆదివాసీ గ్రామాల్లో వింత ఆచారాలు అమల్లోకి వస్తాయి. ఆదివాసీలకు పుష్య మాసం ఎంతో పవిత్రమైన మాసం. ఈ మాసంలో జిల్లాలోని పలు ఆదివాసీ దేవతల జాతరలు నిర్వహిస్తారు. దీంతో ఈ మాసంలో మద్యం తాగడం, చెప్పులు వేసుకోవడం లాంటి వింత ఆచారాలు అమలు ఆనవాయితీగా కొనసాగుతోంది.

ఇప్పటికే పలు గ్రామాల పులిమేరలోనే ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మద్యం తాగిన, పాదరక్షలు ధరించిన రూపాయలు 5000 జరిమానా చెల్లించాలని గూడెం వాసులు నిర్ణయించారు. ఇంద్రవెల్లి మండలం తుమ్మగూడలో ఈ నిర్ణయాన్ని మంగళవారం నుంచి అమలు చేస్తున్నారు.  తుమ్మగూడ గ్రామానికి బయట వారు ఎవరైనా వస్తె ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. గ్రామ పొలిమేరలో చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసి బ్యానర్లు కట్టారు. జనవరి 22వ తేదీ వరకు ఈ నిర్ణయం కట్టుబడి ఉంటుంది.