calender_icon.png 24 December, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ బడిలో వాటర్‌ప్లాంట్

24-12-2025 01:49:11 AM

ఏర్పాటు చేసిన హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ మేనేజర్ లక్ష్మీరామచందర్ 

హైదరాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాం తి): తన స్వగ్రామంలో, తాను చదువుకున్న  పాఠశాల మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మం డలం సూరారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ మేనేజర్ లక్ష్మీ రామచందర్ తన తల్లిదండ్రులు శామమ్మ జ్ఞాపకార్థం ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి, మంగళవారం ప్రారంభించారు.

అనంతరం పాఠశాలలో చదువుకుంటున్న 152 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ అందచేశారు. భవిష్యత్తులో గ్రామ అభివృద్ధికి  తన  సహకారం అందిస్తానని పేర్కొన్నారు. పాఠశాలలో ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినందుకు లక్ష్మీ రామచందర్ కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిలుక నగ రాజు, ఉప సర్పంచ్ మల్లేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయిరెడ్డి పాల్గొన్నారు.