14-05-2025 12:10:41 AM
జిల్లా విద్యాధికారి బొల్లారం భిక్షపతి
నల్లగొండ టౌన్, మే 13 : గుర్తింపు లేని పాఠశాలలలో పిల్లలను చేర్పించవద్దని జిల్లా విద్యాధికారి బొల్లారం బిక్షపతి మంగళవారం తెలిపారు. నల్లగొండ పట్టణంలోని ఈ క్రింద పేర్కొన్న పాఠశాలలు ప్రభుత్వ అనుమతి లేకుండా విద్యార్థులను వారి పాఠశాలల్లో చేర్పించుకొంటున్నట్లు ఈ కార్యాలయము దృష్టికి వచ్చిందన్నారు.
అట్టి పాఠశాల యందు పిల్లలను చేర్పించరాదని తల్లిదండ్రులకు డీఈఓ కోరారు. నల్లగొండ పట్టణంలో గుర్తింపు లేని పాఠశాలలు జయా హైస్కూల్, రవీంద్ర నగర్, ఎలైట్ స్కూల్, నల్లగొండ, లిటిల్ స్కాలర్స్ హై స్కూల్, నల్లగొండ, వేదాంత్ హై స్కూల్, రామగిరి, ఉన్నాయన్నారు.
పిల్లలను ప్రవేటు పాఠశాలల్లో చేర్పించునప్పుడు సంబంధిత పాఠశాలకు ప్రభుత్వ గుర్తింపు ఉన్నదా లేదా అను విషయాన్ని నిర్దారించుకొన్న తరువాతే తమ పిల్లలను పాఠశాలలో చేర్పించాలని పేర్కొన్నారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలన్నారు.