14-05-2025 12:10:40 AM
హైదరాబాద్, మే 13 (విజయక్రాంతి): ఓజోన్ హాస్పిటల్‌లో మంగళవారం నర్సెస్ డే ను ఘనంగా నిర్వహించారు. హాస్పిటల్స్ చైర్మన్ బీవీ సత్యసాయి ప్రసాద్, ఎండి దీప్తి, డైరెక్టర్స్ మధుసూదన్‌రెడ్డి, డాక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.
ఆస్పత్రిలో పనిచేసే నర్సులతో కలిసి కేక్ కటింగ్ చేసి, సంబురాలు జరిపారు. వైద్య చికిత్సలు అందించే విషయంలో నర్సుల పాత్ర ఎనలేనిదని ఈ సందర్భంగా చైర్మన్ సత్యసాయిప్రసాద్ కొనియాడారు. కార్యక్రమంలో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.