calender_icon.png 17 January, 2026 | 6:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగ్లాదేశ్‌కు ఐసీసీ బృందం

17-01-2026 04:19:21 AM

  1. చివరి ప్రయత్నంగా చర్చలు

అనంతరం తుది నిర్ణయం 

దుబాయి, జనవరి 16: టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లను భారత్ నుంచి తరలించాలనే విషయమై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు  బెట్టు వీడడం లేదు. ఇదివరకే షెడ్యూల్ ప్రకటించినందున నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి కోరినా బంగ్లా బోర్డు ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా నెలకొన్న అనిశ్చితికి తెరదించేందుకు ఐసీసీ స్వయంగా రంగంలోకి దిగనుంది.

చివరి ప్రయత్నింగా ఇద్దరు సీనియర్ ప్రతినిధులను బంగ్లాదేశ్ బోర్డు సభ్యు లతో చర్చించేందుకు పంపించనుంది.ఇద్దరు సీనియర్ ప్రతినిధులను ఆ దేశానికి పంపి.. వారికి భరోసా కల్పించాలని ఐసీసీ భావిస్తోంది. ప్రపంచ క్రికెట్‌లో బంగ్లాదేశ్‌ను తాము వేరుగా చూడబోమనే నమ్మకాన్ని వారికి కలిగించి.. భారత్‌లో వరల్డ్‌కప్ ఆడేందుకు ఒప్పించనుంది.బంగ్లాదేశ్‌లో ఈమధ్య హిందువుల హత్య ప్రభావం టీ20 ప్రపంచకప్పుపై పడింది. ఐపీఎల్ వేలంలో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను కొ నడంపై విమర్శలు వెల్లువెత్తడంతో.. చివరకు ముస్తాఫిజుర్‌పై వేటు పడింది. 

దీంతో బంగ్లా బోర్డు ప్రతీకార చర్యలకు దిగింది. ఇదే కారణంతో వరల్డ్‌కప్ మ్యాచ్‌లను భారత్ నుంచి తరలించాలని ఐసీసీకి లేఖ రాసింది. అప్పటినుంచి బంగ్లా జట్లు మ్యాచ్‌లపై అనిశ్చితి నెలకొంది. ఇండియాలో కాకుండా ఎక్కడమైనా తాము ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడుతామని ఐసీసీతో  బంగ్లా బోర్డు స్పష్టం చేసింది.