23-10-2025 12:08:09 AM
- ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి, మద్దతు ధర పొందాలి
- రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు రూ. 20 వేల కోట్లు వెచ్చిస్తున్నాం..
- రైతులకు అందుబాటులో కేంద్రాల ఏర్పాటు
- ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కోనరావుపేట మండలాల్లో కొనుగోలు కేంద్రం ప్రారంభం
కోనరావుపేట అక్టోబర్ 22 (విజయక్రాంతి):ధాన్యం దళారులకు విక్రయించవ ద్దని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.కోనరావుపేట మం డలం కనగర్తి గ్రామంలో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో వట్టిమల్ల గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చే యగా, బుధవారం ప్రభుత్వ విప్ ముఖ్య అతిథిగా హాజరై అదనపు కలెక్టర్ గడ్డం నగే ష్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు.
ఈ ఖరీఫ్ సీజన్ లో సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధా న్యం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. దాదాపు జిల్లా వ్యాప్తంగా 240 వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలు కు రూ. 2389, సాధారణ రకానికి రూ. 2369 మద్దతు ధర కల్పిస్తున్నామని తెలిపా రు. సన్న రకం ధాన్యానికి క్వింటాలుకు రూ. 500 అదనంగా బోనస్ అందిస్తామని ప్రకటించారు. రైతులు అధికారుల సూచన మే రకు ధాన్యం తరలించాలని, తేమ 17 శాతం ఉండేలా చూసుకోవాలని సూచించారు. కనగర్తి గ్రామంలో రైతుల సంఖ్య ఎక్కువని, వా రికి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం అ న్ని ఏర్పాట్లు చేస్తున్నదని విప్ తెలిపారు. రైతులకు ఎల్లప్పడూ ప్రజా ప్రభుత్వం అండ గా ఉంటుందని స్పష్టం చేశారు.
రూ. 20 వేల కోట్ల రుణ మాఫీ..
ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం రూ. 20 వేల కోట్ల రుణ మాఫీ చేసిందని వెల్లడించారు. నూతన రేషన్ కా ర్డులు జారీ చేశామని, ఇప్పటికే ఉన్న కార్డు ల్లో కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేశామని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని విప్ గుర్తు చేశారు. పార్టీలకు అతీతంగా అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తున్నామని, రహదారులు నిర్మిస్తున్నామని తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధి, విస్తరణకు అందరి సలహాలు, సూచనల మేరకు ముందుకు వెళ్తున్నామని వివరించారు.
రాజన్నకు విశేష పూజలు, భక్తులకు మెరుగైన వసతులు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మూలవాగు, పెంటివాగుపై బ్రిడ్జిలు నిర్మిస్తామని విప్ తెలిపారు.కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు కచ్చకాయల ఎల్లయ్య, వైస్ చైర్మన్లు తాళ్లపల్లి ప్రభాకర్,కోనరావుపేట ఫ్యాక్స్ ఛైర్మెన్ బండ నర్సయ్య, డీఆర్డీఓ శేషాద్రి, జిల్లా సహకార అధికారి రామకృష్ణ, జిల్లా పౌర సరఫరాల అధికారి చంద్రప్రకాష్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా, జిల్లా నాయకులు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.