12-08-2025 12:47:10 AM
పసుమాముల గ్రామం లలితానగర్ కాలనీ వాసులు
రంగారెడ్డి జిల్లా ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన బాధితులు
అబ్దుల్లాపూర్ మెట్ , ఆగస్టు 11: భూకబ్జాదారుల చేర నుంచి మా ప్లాట్లను కాపాడి.. మాకు న్యాయం చేయాలని లలితానగర్ కాలనీవాసులు అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో కలెక్టర్ నారాయణరెడ్డికి, ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డికి , అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డిలకు భూకబ్జాదారుల చేర నుంచి.. తమకు న్యాయం చేయాలంటూ వినతి పత్రాలు అందజేశారు.
బాధితుల వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, పసుమాముల గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 407, 408, 412లలో 19 ఎకరాల్లో గుర్రం అంజిరెడ్డి, గుర్రం సత్తిరెడ్డిలు 1980లో సీవీ రమణకుమార్‌కు జీపీఏ చేసినట్లు తెలిపారు. ఆ తర్వాత 1998లో లే అవుట్ చేసి.. ఇందులో 300 గజాల చొప్పున.. 190 ప్లాట్ల లే అవుట్ చేసి క్రయ విక్రయాలు జరిగాయన్నారు. ఈ లేఅవుట్‌లో కొనుగోలు చేసిన ప్లాట్లు కొన్నేండ్లుగా ఖాళీగా ఉండడంతో.. ఇదే అదునుగా భావించిన గుర్రం సత్తిరెడ్డి కొడుకు బుబ్చిరెడ్డి ప్లాట్ల స్థలంలో ధరణి వచ్చిక రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై మళ్లీ భూ రికార్డులలో 15 ఎకరాల మేర తన పేరుమీద పాసుబుక్ తెచ్చుకున్నాడన్నారు.
ఇక్కడ ఏపీ చెందిన ఓ కరెంట్ వైర్లు తయారు చేసే కంపెనీ పెట్టించి.. ఓరియంటల్ బ్యాంక్‌లో లోన్ తీసుకున్నట్లు బ్యాంక్ అధికారుల ద్వారా తెలసిందర్నారు. ఆ తర్వాత లోన్‌కు సంబంధించి వాయిదాలు సరిగా కట్టలేకపోవడంతో 2017లో బ్యాంక్ అధికారులు లలితానగర్ కాలనీ వచ్చి.. చుట్టు ప్రీకాస్ట్ ఏర్పాటు చేసే క్రమంలో ప్లాట్ల యజమానులు అడ్డుకోవడంతో తిరిగి వెళ్లి పోయారు. దీంతో బ్యాంక్ అధికారులు, ప్లాట్ల యజమానులు ఇద్దరు కోర్టుమెట్లు ఎక్కారు.
కోర్డు ఇరువర్గాల వాదానలు విన్న కోర్డు ప్లాట్ల ఓనర్లకే అనుకూలంగా సేటస్కో ఆర్డర్ వచ్చింది. ఇంతటితో ఆగకుండా మరో రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాస్ గుప్తా తెరపైకి వచ్చి అగ్రిమెంట్ చేసుకున్నట్లు చెప్పుకుంటూ.. రెవెన్యూ అధికారులను తప్పదోవ పట్టిస్తున్నాడన్నారు. అనంతరం కాలనీ అధ్యక్షులు కె. సత్యనారాయణ మాట్లాడుతూ.. లలితానగర్ కాలనీ ప్లాట్లు కొనుగోలు చేసినవారందరు పేద, మధ్యతరగతి చెందినవారేనని.. కాయాకష్టం చేసి.. ప్లాట్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు.
సర్వే పేరుతో మా ప్లాట్లను కబ్జా చేయాలని చూస్తే సహించే ప్రసక్తలేదన్నారు. ప్లాట్లను కాపాడుకోవడానికి ఎంత దూరం వెళ్లడానికైనా సిద్ధమేనన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి , ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి, అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సుదర్శన్‌రెడిలు సానుకూలంగా స్పందించి.. మా సమస్యను త్వరలో పరిష్కరిస్తామని హామీనిచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ పి.శ్రీనివాస్‌రెడ్డి , కె వెంకట్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, పిట్ట రాంరెడ్డి, ముస్కు జయమ్మ, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.