12-08-2025 12:44:24 AM
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
ఆమనగల్లు, ఆగస్టు 11 : ఆరోగ్య తెలంగాణనే ప్రభుత్వ లక్ష్యం అని ప్రజా ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. సోమవారం కడ్తాల, ఆమనగల్లు మండలంలో డి వార్మింగ్ గోలీల పంపిణీ కార్యక్రమాన్ని వైద్య సిబ్బందితో కలిసి ఆయన ప్రారంభించారు. కడ్తాలలో ఎస్టీ వసతి గృహం, ఆమనగల్లులో కస్తూర్బా విద్యాలయంలో పలువురు విద్యార్థులకు గోలీలను వేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకటి నుంచి 19 ఏళ్ల లోపు పిల్లలకు తప్పనిసరిగా డి వార్మింగ్ గోలీలను వేసుకోవాలని ఆయన కోరారు. గోలీలు వేసుకోవడంవల్ల విద్యార్థుల్లో రక్తహీనతను నివారించి రోగనిరోధక శక్తిని పెంచుతాయని ఆయన పేర్కొన్నారు. వైద్యుల సూచనతో ప్రతి ఒక్కరూ మాత్రలు వేసుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆయన చెప్పారు. వైద్య సిబ్బంది అన్ని మండలాలలో సంబంధిత శాఖలను సమన్వయం చేసుకొని మాత్రల పంపిణీ విజయవంతం చేయాలని ఆయన సూచించారు.
మాత్రల పంపిణీకి ముందు వాటి యొక్క వినియోగం గురించి వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే తన నివాసంలో పలువురు బాధితులకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులతో పాటు రూ. 2.50 లక్షల ఎల్వోసిని బాధితుడు అమరేందర్ రెడ్డి కి ఆయన అందజేశారు. కార్యక్రమంలో పీసీసీ స్పోక్స్ పర్సన్ బాలాజీ సింగ్, ఏఎంసి వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి,కమిషనర్ శంకర్ నాయక్, డైరెక్టర్ నరేష్ నాయక్, నాయకులు హనుమా నాయక్, శ్రీనివాస్ రెడ్డి, పసుపుల జంగయ్య, కేశవులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.