calender_icon.png 21 July, 2025 | 6:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యోగా చేయండి.. ఆరోగ్యంగా ఉండండి

21-06-2025 08:14:26 PM

అథ్లెటిక్స్ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి..

కామారెడ్డి అర్బన్ (విజయక్రాంతి): ప్రతి ఒక్కరు యోగా చేసి ఆరోగ్యకరమైన జీవితం గడపాలని వాకర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు, ఆథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు  ఆర్కె జైపాల్ రెడ్డి అన్నారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day) సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సుధాకర్ రావు, ప్రపంచ యోగా దినోత్సవం కామారెడ్డి  కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించిన యోగ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మానసిక ఆరోగ్యంగా శరీరకంగా దృఢంగా ఉండాలంటే ప్రతిరోజు యోగా చేయాలన్నారు. యోగ అనేది మన జీవితంలో భాగం చేసుకోవాలని ఆయన సూచించారు. అంతర్జాతీయ యోగా సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాకర్స్ తో మాట్లాడుతూ, భారతదేశాన్ని చూసి ప్రపంచ దేశాలే యోగ చేయడానికి ముందుకు వస్తున్నారని అన్నారు. ప్రపంచంలోని మానవుని మనగడకు యోగా ఒక ఆయుధంగా పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ ముఖ్య సలాదారులు పడిగెల రాజేశ్వరరావు, వజిర్ శివాజీ రావు, ఉపాధ్యక్షుడు లక్ష్మీనరసింహులు, ప్రదాన కార్యదర్శి విద్యా సాగర్, కార్యదర్శి రాంచందర్ గౌడ్, కోశాధికారి నాగరాజు, యోగా మాస్టర్ నివాస్, సభ్యులు రాజనర్సింహారెడ్డి, భాస్కర్, వెంకట్, హన్మండ్లు, కిషన్, భూమేష్, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.