calender_icon.png 5 November, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కెనడా వీసా కష్టం తెలుసా!

05-11-2025 01:20:46 AM

కఠినతరంగా  ఇమిగ్రేషన్ నిబంధనలు

అట్టావా, నవంబర్ 4: ఉన్నత విద్య, కెరీర్‌పై భారతీయ విద్యార్థులు పెట్టుకున్న ఆశ లను కెనడా ప్రభుత్వం నీరుగారుస్తోంది. భారత విద్యార్థులు సమర్పించిన వీసా దరఖాస్తుల్లో నాలుగింట.. మూడు దరఖాస్తుల ను తిరస్కరిస్తున్నది. కెనడా ప్రభుత్వం అంతర్జాతీయ విద్యార్థి వీసా నిబంధనలను కఠిన తరం చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. నివాస కొరత, మౌలిక సదుపాయల కల్పన ఇబ్బందిగా మారడం, స్థానికంగా అయ్యే ఖర్చులు విదేశీ విద్యార్థులు భరించగలరా? అన్న విషయాలను అంచనా వేసి అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు విసా దరఖాస్తులను తిరస్కరిస్తున్నట్లు తెలిసింది.

దీంతో యేటా కెనడా వెళ్లేందుకు భారతీయులు నిరాసక్తత చూపుతున్నారు. క్రమంగా దరఖాస్తుల సంఖ్య కూడా తగ్గు తూ వస్తున్నది. సాధారణంగా అమెరికా తర్వాత విదేశీ విద్యార్థులను ఆహ్వానించే దేశాల్లో కెనడాది రెండో స్థానం. ఆ దేశం గతేడాది సుమారు 10లక్షల మంది విదేశీ విద్యా ర్థులకు అవకాశం కల్పించింది. వీరిలో 41 శాతం భారత్‌కు చెందిన వారే. ఆ తర్వాతి స్థానాల్లో చైనా, వియత్నాం ఉన్నాయి.