calender_icon.png 5 November, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్ వీసాల ప్రక్రియ పునరుద్ధరణ

05-11-2025 01:22:30 AM

ధ్రువీకరించిన అమెరికా కార్మిక శాఖ

వాషింగ్టన్, నవంబర్ 4: ఫెడరల్ ఫం డింగ్ (కేంద్ర ప్రభుత్వ నిధులు) ఆగిపోవడంతో అమెరికా షట్‌డౌన్‌ను ఎదుర్కొంది. దీంతో నెలరోజులపాటు హెచ్1బీ వీసాల ప్రక్రియ నిలిచింది. తాజాగా ప్రక్రియ పునః ప్రారంభమైంది. ఈ మేరకు మంగళవారం ఆ దేశ కార్మిక శాఖ ధ్రువీకరించింది. తాత్కాలిక, శాశ్వత ఉపాధి కార్యక్రమాల కోసం వీసా దరఖాస్తుల ప్రాసెస్‌ను విదేశీ కార్మిక ధ్రువీకరణ కార్యాలయం తిరిగి ప్రారంభించిందని పేర్కొంది.

అమెరికాకు చెందిన కంపె నీలు ఇక దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపింది. కొత్త లేబర్ కండిషన్ అప్లికేషన్లు సమర్పించవచ్చని స్పష్టం చేసింది. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల స్టేటస్‌నూ తెలుసుకోవచ్చని తెలిపింది.

సాంకేతికత, వైద్యరంగాల్లో విదేశీ నిపుణులపై ఆధారపడే కంపెనీలు, వైద్యశాలలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. కొన్నిచోట్ల ఆయా  రంగాలకు సంబంధించిన సేవలు, లావాదేవీలు నిలిచిపోయాయి. తాజా ప్రకటన ప్రభావం భారతీయ పౌ రులకు పెద్ద ఉపశమనం. హెచ్ వీసా పొందేవారిలో 70శాతం మంది భారతీయులు ఉన్నారు.