05-11-2025 12:00:00 AM
ఛత్తీస్‌గఢ్‌లోని గోమ్‌గూడ ప్రాంతంలో గుర్తింపు
చర్ల, నవంబర్ 4 (విజయక్రాంతి): ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భద్రతా దళాలు మావోయిస్టు పార్టీకి చెందిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని గుర్తించి ధ్వంసం చేశాయి. ఫ్యాక్టరీలో 17 రైఫిళ్లతోపాటు భారీ మొత్తంలో మందుగుం డు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. గోమ్‌గూడ అటవీప్రాంతంలో మంగళవారం డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (డీఆర్జీ) బలగాలు కూంబింగ్ చేపట్టాయి. దళాలు ఆ ప్రాం తం లో మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని గుర్తించాయి. 17 రైఫిళ్లు, కొ న్ని రాకెట్ లాంచర్లు, బోర్ రైఫిల్, సింగిల్ షాట్ రైఫిల్స్,కంట్రీ-మేడ్ పిస్టల్స్, బోర్ రై ఫి ల్,సింగల్ షాట్ బారెల్స్, పెద్ద హ్యాండ్ డ్రిల్ మెషిన్, బీజీఎల్ బారెల్స్, బాడీ కవ ర్లు బైట్ పిక్, ఎలక్ట్రిక్ వైర్, ఇనుప పైపులు, గ్రైండర్ ప్లేట్, వెల్డింగ్ హ్యాండ్ షీల్డ్ లభించాయి.