30-12-2025 12:00:00 AM
స్టార్ హీరో రామ్‌చరణ్ నటిస్తున్న రూరల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పెద్ది’. ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వేంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. జాన్వీకపూర్ కథానాయి కగా నటిస్తుండగా, శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమాలో జగపతిబాబు పాత్ర అప్పల సూరిని చిత్రబృందం సోమవారం పరిచ యం చేశారు.
ఈ మేర కు విడుదల చేసిన ఫస్ట్-లుక్ పోస్టర్ జగపతి బాబు ఇంటెన్స్ అవతార్‌లో కనిపిస్తున్నా రు. విరిగిపోయిన కళ్లద్దాలను దారంతో కట్టుకొ ని మరీ ధరించి ఉం డటం ఆసక్తికరంగా ఉంది. 2026, మార్చి 27న థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి సంగీతం ఏఆర్ రెహమాన్ సమకూర్చుతుండగా, ఆర్ రత్నవేలు డీవోపీగా వ్యవహరిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా, ఎడిటర్‌గా నవీన్ నూలి పనిచేస్తున్నారు.