05-11-2025 01:42:21 AM
రాష్ట్ర రెడ్డి సంఘాల నాయకుల డిమాండ్
ముషీరాబాద్, నవంబర్ 4 (విజయక్రాం తి): జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఈడబ్ల్యూఎస్‌కు కమిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర రెడ్డి సంఘాల నాయకులు రాంరెడ్డి, జైపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ రాష్ట్ర రెడ్డి సంఘాల ఆధ్వర్యంలో చలో ఇందిరా పార్క్ కార్యక్రమములో భాగంగా మంగళవారం ధర్నా చౌక్ వద్ద రాష్ట్ర రెడ్డి సంఘాల ఆధ్వర్యంలో రెడ్డి నిరసన దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైశ్య వికాస చైర్మన్ కాచం సత్యనారాయణ, రెడ్డి సంఘాల నాయకులు పలువురు నాయకులు హాజరై మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర రెడ్డి సంఘా ల నాయకులు రాంరెడ్డి, గోపి జైపాల్ రెడ్డి పలువురు మాట్లాడుతూ ఈడబ్ల్యూఎస్ వర్గాలకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ లో అర్హత మార్కులను 90 నుంచి 75కు కుదించాలని, విద్యా, ఉద్యోగ అర్హత పరీక్షలలో రుసుములు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రెడ్డి సంఘం నాయకులు ఏనుగు సతీష్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, లింగారెడ్డి, రెడ్డి సంజీవ రెడ్డి, పద్మ రెడ్డి, గీతారెడ్డి, జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీతనుజా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.