21-07-2025 12:22:21 AM
నిర్మల్, జూలై ౨౦ (విజయక్రాంతి): నిర్మ ల్ జిల్లా, ముధోల్ మండలం, వడ్తల గ్రామానికి చెందిన శ్రీ పాపన్న పటేల్, కళావతిల మూడవ కుమారుడు బాబన్న ఎలు గుదరేకు ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం జంతు శాస్త్రంలో డాక్టరేట్ ప్రదా నం చేసింది. ఆయన పరిశోధనంత ఆచార్య కర్నాటి ప్రతాపరెడ్డి(ప్రస్తుత కె. యు.ఉపకులపతి) పర్యవేక్షణలో జరిగింది.
పరిశోధన అంశం ‘న్యూరో ప్రొటెక్టివ్ ఎఫెకట్స్ ఆఫ్ పిథెసెలోబియం డల్స్ సీడ్ ఎక్ట్రాక్ట్ ఆన్ సోడి యం ఫ్లోరైడ్ ఇండియూస్డ్ న్యూరో డిజెనరేషన్ ఇన్ విస్టార్ రాట్స్ ‘. ఆయన పరిశోధన పత్రాలు జాతీయ అంతర్జాతీయ పత్రికలలో ప్రచురించిబడ్డాయి. ఆయనకు డాక్టరేట్ రావడం పట్ల ప్రొఫెసర్స్, తోటి పరిశోధక విద్యార్థులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.