21-07-2025 12:23:41 AM
కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, జూలై ౨౦ (విజయక్రాంతి): బోనాల పండుగను పురస్కరించుకుని ప్రభుత్వ అధికారులకు ప్రకటించిన సెలవు నేపథ్యం లో, ఈ నెల 21వ తేదీ సోమవారం కలెక్టరేట్లో జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.
ప్రజలు ఈ విషయాన్ని గమ నించి సహకరించాలని ఆమె కోరారు. తదుపరి ప్రజావాణి రాబోయే సోమవారం (జూ లై 28న) యథాతథంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలు ఎవరు సోమవారం అర్జిలు సమర్పించడానికి నిర్మల్ రావద్దని ఆమె సూచించారు.