calender_icon.png 2 July, 2025 | 5:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యలు పరిష్కరించే వరకు నిరసన

02-07-2025 12:00:35 AM

-తెలంగాణ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు వాకిటి అశోక్ 

మహబూబ్ నగర్ జూలై 1 : జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించే వరకు తమ నిరసన కార్యక్రమం ఆపేది లేదని తెలంగాణ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు వాకిటి అశోక్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపం ముందు గత కొన్ని రోజులుగా చేస్తున్న నిరసన కా ర్యక్రమాన్ని యధావిధిగా కొనసాగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులకు అతి ముఖ్యమైన సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఉన్నత అధికారులు ప్రజాప్రతిని ధులు స్పందించాలని విన్నవించారు. లేనియెడల తమ నిరసన కార్యక్రమాలు యధావిధిగా కొనసాగుతుందని తెలిపారు. నిరసన కార్యక్రమానికి మెట్టు కాడి శ్రీనివాసులు మద్దతు తెలియజేశా రు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి విజయకుమార్, జిల్లా కార్యదర్శి మొలకపల్లి గోపాల్, జాతీయ కౌన్సిల్ సభ్యులు ఉమామహేశ్వర రావు, మూయిజు , రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొహమ్మద్ రఫీ, పరిపూర్ణం  తదితరులు ఉన్నారు.