calender_icon.png 6 July, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిద్రలో ఇలా అనిపిస్తుందా?

29-06-2025 12:00:00 AM

నిద్రలో నోరు లేదా గొంతు ఎండిపోవడం అనేది ఒక సాధారణ సమస్య. కానీ అది రోజువారీ సమస్యగా మారితే, దాన్ని తేలికగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇది శరీరంలోని ఏదైనా వ్యాధికి సంకేతం కావచ్చు. తరచూ నోరు పొడిబారడం, గొంతు ఎండిపోవడం అనేది ఏ వ్యాధి లక్షణం? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..

ఒక వ్యక్తి పగటిపూట తగినంత నీరు తాగకపోతే, రాత్రిపూట నోరు పొడిబారుతుంది. ఇది డీహైడ్రేషన్ వల్ల జరుగుతుంది. రాత్రి నిద్రపోతున్నప్పుడు నోరు ఎండిపోవడం అనేది యాంటీ అలెర్జీ, డిప్రెషన్, రక్తపోటు, మూత్ర విసర్జన లేదా జలుబు వంటి సమస్యలతో కూడా రావచ్చని నిపుణులు చెబుతున్నారు. మద్యం, పొగాకు లేదా కెఫిన్ అధికంగా ఉండే వాటిని తీసుకున్న లాలాజల గ్రంథులు ప్రభావితం అవుతాయి.

ఇది శరీరంలో నీటి శాతాన్ని తగ్గిస్తుంది. డయాబెటిస్ రోగులకు చాలా దాహం వేస్తుంది. నోరు పొడిబారడం డయాబెటిస్ ప్రారంభ లక్షణంగా పరిగణించాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే స్లీప్ అప్నియాలో, నిద్రలో శ్వాస తీసుకోవడం అడపాదడపా జరుగుతంది. ఇది నోరు పొడిబారే సమస్యకు కారణమవుతుంది. ముక్కు మూసుకుపోవడం, సైనస్, టాన్సిల్స్ లేదా ఏదైనా అలెర్జీ కారణంగా నిద్రపోతున్నప్పుడు నోరు తెరిచి ఉండవచ్చు.

దీనివల్ల కూడా నోరు పొడిబారుతుంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే తగినంత నీరు తాగాలి. ఆల్కహాల్, పొగాకు, కెఫిన్ పదార్థాలు తక్కువగా తీసుకోవాలి. నిద్రపోయే ముందు కొంచెం నీరు తాగాలి. దీర్ఘకాలికంగా ఈ సమస్య ఉంటే వైద్యుడిని సంప్రదించాలి.