29-06-2025 12:00:00 AM
జీర్ణకోశం బలంగా లేకపోతే నోటి దుర్వాసన అధికంగా ఉంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు నలుగురిలోకి వెళ్లాలన్న చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి నోట్లో దుర్వాసన రాకుండా ఎలాంటి చిట్కాలు ఫాలో అవ్వాలో తెలుసుకుందాం..
కొబ్బరి పాలల్లో తగినంత కర్పూరం వేసుకుని పచ్చిగానే తాగవచ్చు. లేదా బాగా కాచి తాగవచ్చు. ఇలా చేస్తే నోటి దుర్వాసన తగ్గుతుంది.
నిమ్మకాయ నాలుగు భాగాలుగా చేసి చిన్న ముక్కలుగా తరిగి, ఒక్కో ముక్కని బుగ్గన పెట్టుకుని చప్పరిస్తే నోరు శుభ్రపడుతుంది. దుర్వాసన పోతుంది.
జాబికాయ, జాపత్రీ, పచ్చ కర్పూరం కొద్దిగా తీసుకొని దంచి, ఎండుద్రాక్షలతో నూరి, చిన్న మాత్రలు కట్టి ఒక్క మాత్రని బుగ్గన పెట్టుకుని చప్పరించాలి. ఇలా చేస్తే నోటి దుర్వాసన నుంచి ఉపశనమం లభిస్తుంది.
దాల్చిన చెక్క బెరడు చిన్న ముక్కను నోట్లో ఉంచుకుని నములుతూ ఉంటే నోరు శుభ్రంగా ఉంటుంది.
యాలకులు, లవంగం కూడా నోటి దుర్వాసనను తగ్గిస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు నోట్లో యాలకులు, లవంగాలు గానీ వేసుకోవడం ఉత్తమం.