23-10-2025 01:47:16 AM
వెంకటాపూర్(రామప్ప), అక్టోబర్22, (విజయక్రాంతి): మండలంలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని అమెరికా మఱియు టర్కీ దేశానికి చెందిన యాస్మిన్, చరిత లు కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీరామలింగేశ్వర స్వామివారికి దర్శించుకొని స్వామివారి తీర్థప్రసాదాలను ఆలయ అర్చకులు అందించా రు. అనంతరం టూరిజం గైడ్ తాడబోయిన వెంకటేష్ ఆలయ ప్రాముఖ్యత, చరిత్ర, శిల్పకళా నైపుణ్యం గురించి వారికి వివరించారు.
ఆలయ నిర్మాణం, శిల్పకళ, ప్రాచీన శిల్పాలను పరిశీలించి వారు చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. రామప్ప ఆలయం భారతీయ శిల్పకళలో ఒక అద్భుతమని, ఇక్కడి శిల్పా లు, నిర్మాణం అద్భుతంగా ఉన్నాయని, సంప్రదాయాలు, ఆచారాలను ప్రత్యక్షంగా చూడడం గొప్ప అనుభవం అని కొనియాడారు. అనంతరం రామప్ప సరస్సు, ప్రకృతి అందాలను వీక్షించారు.