calender_icon.png 23 September, 2025 | 2:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యా నిధికి చేయూత ఇవ్వండి

23-09-2025 12:40:12 AM

  1. విద్యా నిధికి రూ.5 లక్షల విరాళం ఇచ్చిన 

ప్రముఖ న్యాయవాది ప్రతాప్ కుమార్, 

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): నగరంలో అన్ని రంగాల్లో ఉన్న ప్రముఖులు విద్యా నిధికి విరివిగా విరాళాలు ఇవ్వాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.  మహబూబ్ నగర్ నగరానికి చెందిన ప్రముఖ న్యాయవాది ప్రతాప్ కు మార్ విద్యా నిధికి రూ 5 లక్షల చెక్కు ను ఎమ్మెల్యే సమక్షంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బో యికి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు.

విద్యా నిధికి విరాళం ఇచ్చిన ప్రముఖ న్యాయవాది ప్రతాప్ కుమార్ ను ఎమ్మెల్యే ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యా నిధికి వచ్చే ప్రతి పైసా విద్యాభివృద్ధికే ఖర్చు చేస్తామని స్పష్టం చే శారు.

అనంతరం ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మహబూబ్ నగర్ లో విద్యాభివృద్ధికి చేస్తున్న కృషి చాలా గొప్పదని, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చే స్తున్నారని ఆయన అన్నారు.  విద్యా నిధికి ఐదు లక్షల రూపాయల విరాళం ఇవ్వడం సంతోషం గా ఉందన్నారు.  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.