18-09-2025 12:30:05 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): గ్రామీణ ప్రతిభకు తెలంగాణ సరస్ మేళా గ్లోబల్ వేదిక కానున్నదని మంత్రి సీతక్క బుధవా రం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 19న ప్రారంభమయ్యే సరస్ మేళా 29వ తేదీ వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్ హైటెక్ సిటీలో పల్లెకాంతులు వెదజల్లుతూ సరస్ మేళా ద్వారా గ్రామీణ ఉత్పత్తుల మహా ప్రదర్శన, అమ్మకాలు జరుగుతాయని తెలిపారు.
దేశం నలుమూలల నుంచి తెచ్చిన ప్రత్యేక కళాకృతులు, చేనేత వస్త్రాలు, అరుదైన వంటకాలన్నీ సరస్ మేళాలో ప్రదర్శించ నున్నట్టు స్పష్టం చేశారు. సరస్ మేళాలో దట్టమైన అడవి ప్రాంతా ల్లో దొరికే తేనె, ఇప్ప పువ్వు లడ్డూలు వంటి అరుదైన ఆహార పదార్థాలు, ఎన్నో వస్తువులు లభిస్తాయని, సరస్ మేళా ఆనందాన్ని ఆస్వాదించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.