04-07-2025 12:20:02 AM
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
మణుగూరు, జులై 3 ( విజయ క్రాంతి ) : రక్తదానం ప్రాణదానంతో సమానమని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నా రు. గురువారం స్థానిక 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో కింగ్ డోమ్స్ కల్చర్ మినిస్ట్రీస్, ఎస్.కే అంజుమనార బేగం ఆధ్వర్యంలో ఏ ర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ.. రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని,అత్యవసర సమయాల్లో రక్తం అందక ఎంతో మంది మృతి చెందుతున్నారన్నారు.
ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరు ఆరు నెలలకు ఒక్కసారి రక్తదానం చేయాలనీ కోరారు. రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. రక్తదానం చేయడం మంచి కార్యక్రమమని, ఒకవైపు ఉద్యోగంతో పాటు సామాజిక కోణంలో రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అంజుమనార బేగం ను అభినందించారు.
రక్త దానం చేసిన పలువురికి పండ్లను పంపిణీ చేశారు. అనంతరం ఆస్పత్రిలోని రోగులను పరామర్శించి, వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూ చించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు పీరినాకి నవీన్ , పట్టణ అధ్యక్షులు శివ సైదులు , నియోజకవర్గ యత్ కాంగ్రెస్ అధ్యక్షులు తరుణ్ రెడ్డి , చైతన్య నాయుడు , కూచిపూడిబాబు, సుబ్బారెడ్డి ,మండల నాయకులు, కార్యకర్తలు, వైద్యలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.