19-07-2025 12:10:29 AM
చేవెళ్ల: చేవెళ్ల మండలం దేవరంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి ఎన్కేపల్లి మాజీ ఎంపీటీసీ వనం మాధవి లక్షీకాంత్ రెడ్డి రూ.2 లక్షల విరాళం ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం ఆలయ కమిటీ సభ్యులకు డబ్బులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని, ఆలయాల నిర్మాణం, అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దేవరంపల్లి గ్రామంలో నిర్మిస్తున్న ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణంలో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందన్నారు.