06-12-2024 02:53:10 AM
హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదై న ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుకు హైకోర్టులో ఊరట లభించింది. హరీశ్ రావును అరెస్టు చేయరాదని, ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. రియల్ ఎస్టేట్ వ్యా పారి గాధగోని చక్రధర్‌గౌడ్ ఫిర్యాదు మేరకు నమోదైన కేసును సవాల్ చేస్తూ హరీశ్‌రావు వేసిన పిటిషన్‌లో హైకోర్టు పంజాగుట్ట పోలీసులకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
కౌంటర్ దాఖలు చేయాలని చక్రధర్ గౌడ్‌కు నోటీసులు జారీచేసింది. విచారణను ఈ నెల 30కి వాయిదా వేస్తూ జస్టిస్ కే లక్ష్మణ్ గురువారం ఆదేశాలను జారీచేశారు. హరీశ్‌రావు తరఫున సీనియర్ లాయర్ జే రామ చంద్రరావు వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌పై అభియోగాలకు, నమోదు చేసిన చట్ట నిబంధనలకు పొంతన లేదన్నారు. పిటిషనర్‌పై నమ్మక ద్రోహం, ప్రాణభయం సెక్షన్ల కింద చక్రధర్ గౌడ్ చేసిన ఫిర్యాదులోని అభియోగాలకు ఆధారాలు లేవని చెప్పారు.
హరీశ్‌రావు మంత్రిగా ఉండగా చక్రధర్ గౌడ్, కుటుంబ సభ్యుల ఫోన్ల ట్యాపింగ్ చేయించారంటూ ఈ నెల 1న చేసిన ఫిర్యాదుకు ఆధారాలను పేర్కొన లేదని చెప్పారు. రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు ఫిర్యాదు చేశారని స్పష్టంచేశారు. ఆపిల్ ఫోన్ల కంపెనీ నుంచి వినియోగదారులు అందరికీ తరుచుగా వచ్చే ఒక మెసేజ్‌ను ఆధారంగా చేసుకుని చక్రధర్‌గౌడ్ తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు.
ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ గత నవంబర్ 22న హైకోర్టులో పిటిషన్‌ను చక్రధర్‌గౌడ్ ఉపసంహరణ చేసుకున్నారని గుర్తుచేశారు. ఆ తర్వాత రోజే డీజీపీకి తిరిగి ఫిర్యాదు చేశారని చెప్పారు. అనంతరం హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తే దానిని కమిషనర్ పంజాగుట్ట పోలీసులకు ఫార్వార్డ్ చేశారని తెలిపారు. రాజకీయ కుట్రతో చేసిన ఫిర్యాదును పోలీసులు ప్రాథమిక విచారణ కూడా చేయ కుండానే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని ఆరోపించారు.
రాజకీయ కుట్రతో చేసిన ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసే అవకాశాలు ఉన్నందున అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. పిటిషనర్‌కి ప్రజల్లో ఉన్న పేరు పతిష్ఠ దెబ్బతిసేందుకే కేసు నమోదు చేశారన్నారు. చక్రధర్‌గౌడ్ 2021 నుంచి హరీశ్‌రావుపై ఏదో ఒక కేసు నమోదు చేస్తూనే ఉన్నారని చెప్పారు. గతంలో తాను ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో కూడా హరీశ్ బెదిరించారని తాజా ఫిర్యాదులో చక్రధర్‌గౌడ్ పేర్కొన్నారని, అదే నిజమైతే ఆనాడే కేంద్ర ఎన్నికల సంఘానికి ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. రాజకీయ కక్షతో, కట్టుకథలతో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని కోరారు.
ప్రభు త్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూద్రా, పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్‌రావు వాదనలు వినిపించారు. ఆపిల్ కంపెనీ నుంచి గౌడ్‌కు ఫోన్ ట్యాపింగ్ అవుతోందనే ఈహూౠమెయిల్ ద్వారా మెసేజ్ వచ్చిందని, పిటిషనరే ఫోన్ ట్యాపింగ్ చేయించారనే అభియోగాలపై నమోదైన కేసులో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వరాదని లూద్రా కోరారు. రాజకీయంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం పరిపాటని, కానీ, ఫోన్ ట్యాపిం గ్ యత్నాలపై పోలీసుల విచారణ దశలోనే అడ్డుకోరాదని, స్టే ఇవ్వరాదని కోరారు.
ఎన్నికల పిటిషన్‌కు, ఫోన్ ట్యాపింగ్ ఫిర్యాదులకు సంబంధం లేదని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ అవుతుందనే మెసేజ్ ఆయా ఫోన్ల కంపెనీల నుంచి వస్తూనే ఉంటాయని హైకోర్టు పేర్కొంది. గత ఏడాది వచ్చిన అలాంటి మెసేజ్‌పై ఇప్పుడు ఫిర్యాదు చేయడం ఏమిటని ఫిర్యాదుదారుడిని ప్రశ్నించింది. కేసు విచారణపై స్టే ఇవ్వలేమని పిటిషనర్‌కు చెప్పింది. పిటిషనర్‌ను అరెస్టు చేయరాదని ఉత్తర్వులు జారీచేసింది. కౌంటర్ దాఖలు చేయాలని చక్రధర్‌గౌడ్‌ను ఆదేశించింది. విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.
హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని 51 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేయ డాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ గురువారం ఉత్త ర్వులు జారీచేసింది. శంషాబాద్ మున్సిపాలిటీలో 51 గ్రామాలకు విలీ నం చేస్తూ ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్ 3ను సవాల్ చేస్తూ మాజీ సర్పంచి జీ పద్మావతి, మరికొందరు వేర్వేరుగా దాఖాలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ .ఏ శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ఆయా గ్రామాల ప్రజలు విలీనాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పారు.
పట్టణీకరణతో సహజ జీవనానికి ఇబ్బందులు ఎదురవుతాయని, జీవన వ్యయం పెరిగిపోతుందని అన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండా హడావుడిగా ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన అవసరం లేదన్నారు. అడ్వొకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. గ్రామ పంచాయతీల పరిమితులు, హద్దులను సవరించడానికి అధికారం ఉంద ని అన్నారు. అభివృద్ధి ప్రక్రియలో భాగంగా నగర విస్తరణ సహజమైన పరిణామమేనని చెప్పారు. మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు తీరిపో యిందని, వీటికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ నేప థ్యంలో ఆర్డినెన్స్ తీసుకురావాల్సి వచ్చిందని తెలిపారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం పిటిషన్లను ఆమోదించడానికి సరైన కారణాలు లేవని, పిటిషన్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.